E-Paper
Advertisement

2026 సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ మైలేజ్ టెస్ట్.. సిటీ, హైవేలో ఎంత ఇచ్చిందంటే?

2026 సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ మైలేజ్ టెస్ట్.. సిటీ, హైవేలో ఎంత ఇచ్చిందంటే?
Advertisement

2026 Burgman Street 125 Mileage Test: సుజుకి ఇటీవల భారత మార్కెట్లో న్యూ జెనరేషన్ 2026 బర్గ్మాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ ను విడుదల చేసింది. ఈసారి కంపెనీ స్కూటర్‌ కు కీలకమైన అప్‌డేట్స్ ఇచ్చింది. స్టైలింగ్, రైడింగ్ కంఫర్ట్‌ తో పాటు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ పై కూడా ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్‌ ను రోడ్డుపై టెస్ట్ చేసిన తర్వాత, వాస్తవ పరిస్థితుల్లో ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా పరీక్షించారు. సిటీ ప్రయాణాలు, హైవే రైడింగ్‌ లో స్కూటర్ ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం.

ముందుగా సిటీలో మైలేజ్ టెస్ట్

మొదటగా సిటీలో బర్గ్మాన్ స్ట్రీట్ 125 మైలేజ్‌ ను పరీక్షించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లు, సిగ్నల్స్, కొన్ని ఖాళీ రోడ్లు కలిపి సుమారు 10 కిలోమీటర్ల టెస్ట్ రూట్‌ ను ఎంచుకున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి స్కూటర్‌ను ఎలా నడుపుతాడో అదే విధంగా టెస్ట్ చేశారు. ఎక్కువ మైలేజ్ కోసం ప్రత్యేకంగా నెమ్మదిగా నడపడం, హైపర్ మైలింగ్ ప్రయత్నాలు చేయలేదు. టెస్టింగ్ సమయంలో ఎక్కువగా తేలికపాటి థ్రాటిల్ ఉపయోగించారు. ట్రాఫిక్‌ లో స్కూటర్ మిడ్ రేంజ్ పనితీరును ఎక్కువగా ఉపయోగిస్తూ రైడ్ చేశారు. మొత్తం 63.6 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత స్కూటర్ ట్యాంక్‌ ను మళ్లీ ఫుల్ చేశారు. ఈ సమయంలో 1.09 లీటర్ల పెట్రోల్ పట్టింది. దీనిని బట్టి లెక్కిస్తే, కొత్త బర్గ్మాన్ స్ట్రీట్ నగరంలో లీటరుకు 58.34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చింది. ఈ లెక్కల ప్రకారం ఒక ఫుల్ ట్యాంక్‌తో 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైవే, సిటీలో కలిపి మైలేజ్ టెస్ట్

Advertisement

ఇక హైవే, సిటీలో కలిపి స్కూటర్‌ మైలేజ్ ను పరీక్షించారు. ఈ టెస్ట్‌ లో ట్రాఫిక్ రోడ్లు, ఓపెన్ హైవేలు, కొన్నిసార్లు పూర్తి థ్రాటిల్‌ తో హై స్పీడ్ రైడింగ్ కూడా చేశారు. మొత్తం 176.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన సమయంలో స్కూటర్ 3.47 లీటర్ల పెట్రోల్ వాడేసింది. దీని ప్రకారం హైవే, నగర ప్రయాణాలు కలిపి చూస్తే, బర్గ్మాన్ స్ట్రీట్ లీటరుకు 50.28 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. హై స్పీడ్ రైడింగ్ చేసినప్పటికీ ఈ స్థాయి మైలేజ్ రావడం మంచి విషయంగా చెప్పవచ్చు.  సుదూర  ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది ఖర్చు తగ్గించే స్కూటర్‌ గా నిలుస్తుంది.

ఇక ఈ మైలేజ్ టెస్ట్ ను ఉదయం ట్రాఫిక్ మితంగా ఉండే సమయంలో నిర్వహించారు. ముందుగా ట్యాంక్‌ ను పూర్తిగా నింపి, సరైన టైర్ ప్రెషర్ సెట్ చేశారు. టెస్ట్ ముగిసిన తర్వాత అదే పెట్రోల్ బంక్‌ లో, అదే డిస్పెన్సర్ ద్వారా మళ్లీ ఫుల్ ట్యాంక్ చేశారు. ఇలా చేయడం వల్ల మైలేజ్ లెక్కలు మరింత కచ్చితంగా వచ్చాయి.  2026 సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ 125 మంచి కంఫర్ట్‌ తో పాటు అద్భుతమైన ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కూడా లభించింది.

Advertisement

Read Also: ట్రయంఫ్ నుంచి మరో క్లాసిక్ బైక్.. బోన్నెవిల్ 400 డీటైల్స్ రివీల్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×