E-Paper
Advertisement

పవర్‌ ఫుల్ ఇంజిన్‌.. అదిరిపోయే ఫీచర్లు.. కొత్త బ్రెజ్జా వచ్చేసింది!

పవర్‌ ఫుల్ ఇంజిన్‌.. అదిరిపోయే ఫీచర్లు.. కొత్త బ్రెజ్జా వచ్చేసింది!
Advertisement

2026 Maruti Brezza Launched: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రూ. 7.40 లక్షల ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) అధికారికంగా విడుదలైంది. ఈసారి బయటకు పెద్దగా డిజైన్ మార్పులు చేయకపోయినా, లోపల ఫీచర్లు, ఇంజిన్ పనితీరు, కొన్ని ప్రాక్టికల్ అప్‌ డేట్స్ తో కంపెనీ ఈ SUVని మరింత ఆకట్టుకునేలా తీసుకొచ్చింది. రోజువారీ వినియోగంతో పాటు కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక మార్పులు చేసింది.

ఎక్స్‌ టీరియర్ గురించి..

కొత్త బ్రెజ్జా ముందు భాగంలో చిన్ని చిన్న మార్పులు చేశారు. కొత్త స్టైల్ గ్రిల్‌ తో పాటు గోల్డ్ కలర్ ఇన్సర్ట్‌ లు, ఫాగ్ ల్యాంప్‌ ల చుట్టూ కొత్త ట్రయాంగిల్ డిజైన్, రిఫ్రెష్ చేసిన డోర్ క్లాడింగ్, కొత్త అల్లాయ్ వీల్స్ ఈ SUVకి మరింత స్టైలిష్ లుక్‌ను అందిస్తున్నాయి. అలాగే అండర్‌ బాడీలో కొత్త CNG ట్యాంక్‌ ను కూడా అమర్చారు. అయితే, బ్రెజ్జా  లుక్ మాత్రం గతంలో మాదిరిగానే కొనసాగింది. క్యాబిన్‌ లో మాత్రం కీలక మార్పులు చేశారు. మారుతి విక్టోరిస్‌ లో ఉన్న కొన్ని ఫీచర్లను ఈ కొత్త బ్రెజ్జాలో కూడా అందించింది. ఇందులో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, క్లైమేట్ కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్లు ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Advertisement

అంతేకాదు, యాక్టివ్ కూలింగ్ సౌకర్యంతో కూడిన వైర్‌ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, కొత్త HVAC కంట్రోల్ ప్యానెల్, వెనుక ప్రయాణికుల కోసం కొత్త హెడ్‌ రెస్ట్‌ లను కూడా అందించారు. గత మోడల్‌ లో ఉన్న 360 డిగ్రీల కెమెరా, డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు లాంటి ఫీచర్లను కూడా అలాగే కొనసాగించారు.

ఏడు రంగుల్లో కొత్త బ్రెజ్జా

కొత్త బ్రెజ్జా ఏడు మోనో టోన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వీటిలో స్ప్లెండిడ్ సిల్వర్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, బ్లూయిష్ బ్లాక్, వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బేజ్ ఉన్నాయి. అటు డ్యూయల్ టోన్ వేరియంట్లలో లస్ట్రస్ బేజ్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్ కు బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌ ను యాడ్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్లు SUVకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

టర్బో ఇంజిన్ తో అందుబాటులోకి..

Advertisement

ఈ కొత్త బ్రెజ్జాలో అత్యంత కీలకమైన మార్పు ఇంజిన్ సెగ్మెంట్ లో జరిగింది. ఇందులో 1.0 లీటర్ బూస్టర్‌ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 108 bhp పవర్‌ తో పాటు 170 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ మారుతి ఫ్రాంక్స్‌ లో కూడా ఉన్నప్పటికీ, అక్కడ 99 bhp పవర్, 147 Nm టార్క్‌ ను మాత్రమే అందిస్తుంది. బ్రెజ్జా కోసం ఈ ఇంజిన్‌ను మరింత మెరుగైన ట్యూనింగ్‌ తో రూపొందించడం వల్ల పనితీరు మరింత బాగుందని కంపెనీ తెలిపింది.

మార్కెట్ లో ఏ మోడల్స్ తో పోటీ పడుతుందంటే?

ధర, ఫీచర్లు, టర్బో ఇంజిన్, ఆధునిక టెక్నాలజీ పరంగా చూస్తే 2026 మారుతి బ్రెజ్జా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో బలమైన పోటీని ఇవ్వనుంది. ఈ మోడల్ టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్, కియా సోనెట్ లాంటి ప్రముఖ SUVలకు పోటీగా మార్కెట్లో నిలవనుంది.

Read Also: కియా సైరోస్, VF6 మధ్య గట్టి పోటీ.. రెండింటిలో ఏ ఎలక్ట్రిక్ SUV కొనడం బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×