E-Paper
Advertisement

2026 హోండా గోల్డ్ వింగ్ విడుదల.. రూ.44.30 లక్షల ధరతో లగ్జరీ టూరర్ ఎంట్రీ!

2026 హోండా గోల్డ్ వింగ్ విడుదల.. రూ.44.30 లక్షల ధరతో లగ్జరీ టూరర్ ఎంట్రీ!
Advertisement

2026 Honda Gold Wing Launched: హోండా తన ఫ్లాగ్‌ షిప్ లగ్జరీ టూరింగ్ మోటార్‌ సైకిల్ గోల్డ్ వింగ్ 2026 మోడల్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ.44.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. అయితే, కొత్త మోడల్‌ లో పెద్దగా మెకానికల్ మార్పులు చేయకపోయినా, ఒక కొత్త కలర్ ఆప్షన్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, గత మోడల్‌ తో పోలిస్తే ధరను కూడా పెంచింది. హోండా గోల్డ్ వింగ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రీమియం టూరింగ్ బై క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలను ఈ బైక్ మీద సౌకర్యవంతంగా చేసే అవకాశం ఉంటుంది. ఈ మోటార్‌ సైకిల్ లగ్జరీ, టెక్నాలజీ, పనితీరు పరంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఇంజిన్ గురించి..

2026 గోల్డ్ వింగ్‌ లో కూడా అదే 1,833 సీసీ లిక్విడ్ కూల్డ్, సిక్స్ సిలిండర్ ఇంజిన్‌ ను కొనసాగించింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 126 హెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీని పనితీరు సుదూర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్‌ కు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌ మిషన్ ను యాడ్ చేశారు. ఈ గేర్‌ బాక్స్‌ లో రివర్స్ మోడ్‌ తో పాటు వాకింగ్ స్పీడ్ మోడ్ కూడా ఉంటుంది. దాదాపు 400 కిలోల బరువు ఉన్న ఈ భారీ టూరింగ్ బైక్‌ ను తక్కువ వేగంతో తీసుకెళ్లేటప్పుడు ఈ ఫీచర్లు చాలా ఉపయోగపడతాయి. పార్కింగ్ ప్రాంతాల్లో, ఇరుకైన ప్రదేశాల్లో బైక్‌ ను ఈజీగా కంట్రోల్ చేయడానికి సాయపడుతాయి.

ఫీచర్ల గురించి..

Advertisement

గోల్డ్ వింగ్‌ లో లగ్జరీ టూరింగ్‌ కు అవసరమైన పలు సదుపాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ గా సర్దుబాటు చేసుకునే విండ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీంతో రైడర్‌ కు మరింత సౌకర్యవంతమైన జర్నీ ఎక్స్ పీరియెన్స్ లభిస్తుంది. ఇక ఈ బైక్‌ లోని మరో ప్రత్యేకత ఎయిర్‌ బ్యాగ్. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎయిర్‌ బ్యాగ్ ఫీచర్‌ తో లభిస్తున్న ఏకైక మోటార్‌ సైకిల్ హోండా గోల్డ్ వింగ్ మాత్రమే. ప్రమాద సమయంలో రైడర్ భద్రతను మెరుగుపరచడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్ తో అందుబాటులోకి!

2026 మోడల్‌ లో డిజైన్, ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, హోండా కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. గతంలో అందుబాటులో ఉన్న బోర్డో రెడ్ మెటాలిక్ రంగును నిలిపివేసి, దాని స్థానంలో కొత్త షేడ్‌ ను తీసుకువచ్చింది. కొత్త మోడల్‌ కు మరింత ప్రెష్ లుక్ ఇవ్వాలని కంపెనీ ప్రయత్నించింది.

ధర ఎంత అంటే?

Advertisement

గత మోడల్ ధర రూ.42.82 లక్షలు ఉండగా, ఇప్పుడు కొత్త వెర్షన్ ధర రూ.44.30 లక్షలకు పెరిగింది. దాదాపు రూ.1.48 లక్షల మేర ధర పెరిగింది.

Read Also: 20 ఏళ్ల తర్వాత కవాసకి సంచలనం.. కొత్త టూ-స్ట్రోక్ బైక్ విడుదల!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×