E-Paper
Advertisement

నలుగురు కూర్చునేలా చిన్న ఈవీ కారు, ధర.. జస్ట్ 2.5 లక్షలే!

నలుగురు కూర్చునేలా చిన్న ఈవీ కారు,  ధర.. జస్ట్ 2.5 లక్షలే!
Advertisement

Changan Lumin L Mini EV: రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఆయా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కొత్త కార్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే 2026 చాంగన్ లూమిన్ L అనే మినీ, క్యూట్ సిటీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. సిటీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు, తక్కువ ఖర్చుతో ఈజీగా డ్రైవ్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. 3 డోర్ కాంపాక్ట్ డిజైన్‌ తో వచ్చిన ఈ కారు చూడ్డానికి చిన్నగా ఉన్నా, చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఒకే ఛార్జ్ తో 300 కి.మీ ప్రయాణం

ఈ కారు 28.1 kWh బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్ తో 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తుంది. రోజువారీ ఆఫీస్ వెళ్లడం, షాపింగ్, చిన్న ట్రిప్స్ లాంటి అవసరాలకు ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. టైప్ 2 ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల, నగరాల్లో ఉన్న చాలా ఛార్జింగ్ స్టేషన్లలో సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇక ఈ కారు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుమారు 47 నుంచి 48 హార్స్‌ పవర్ పవర్‌ ను అందిస్తుంది. 83Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్కువ స్పీడ్ కోసం కాకుండా, సిటీ ట్రాఫిక్‌ లో సాఫ్ట్‌ గా, సులభంగా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. ఈ కారు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నగర వినియోగానికి సరిపడేలా ఉంటుంది.

లూమిన్ L డిజైన్ గురించి..

లూమిన్ L డిజైన్ విషయానికి వస్తే, చూడ్డానికి చాలా క్యూట్ గా మోడర్న్ లుక్‌ తో ఆకట్టుకుంటుంది. నలుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. వెనుక సీట్లు మడతపెట్టే అవకాశం ఉండటం వల్ల, అవసరమైతే కార్గో స్పేస్‌ ను పెంచుకోవచ్చు. సాధారణంగా 104 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 150mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల రోడ్ల మీద చిన్న చిన్న గుంతలు ఉన్నా సులభంగా ప్రయాణం చేస్తుంది.

లూమిన్ L ఫీచర్ల గురించి..

Advertisement

ఈ కారు ఫీచర్ రిచ్ గా ఉంటుంది. 7-అంగుళాల డిజిటల్ డిస్‌ ప్లే, రివర్స్ కెమెరా, 12V పవర్ సాకెట్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గేర్ సెలెక్టర్‌ ను సింపుల్ నాబ్ రూపంలో ఇవ్వడం వల్ల వాడటం చాలా ఈజీగా ఉంటుంది. డ్రైవర్‌కు అవసరమైన బేసిక్ ఫీచర్లు అన్నీ ఈ కారులో ఉన్నాయి.

లూమిన్ L డిజైన్ ధర ఎంత?

లూమిన్ L డిజైన్ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 2.5 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్‌లో ఈ కారు చిన్న వులింగ్ హాంగ్‌ గ్వాంగ్ మినీ EV, విన్‌ఫాస్ట్ VF3 లాంటి మోడళ్లతో పోటీ పడనుంది. డిజైన్, సింపుల్ ఫీచర్లు, మంచి రేంజ్ కలిసి ప్రత్యేకమైన కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది. తక్కువ ఖర్చుతో, సౌకర్యంగా సిటీలో ప్రయాణించాలనుకునే వారికి ఈ కారు మంచి ఆప్షన్ కానుంది.

Read Also: టయోటా To నిస్సాన్.. ఏప్రిల్ లో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×