E-Paper
Advertisement

స్టైలిష్ లుక్‌ తో SR GT 200.. కొత్త కలర్ ఏముంది భయ్యా!

స్టైలిష్ లుక్‌ తో SR GT 200.. కొత్త కలర్ ఏముంది భయ్యా!
Advertisement

Aprilia SR GT 200 Sport Update: ఏప్రిలియా SR GT 200 స్కూటర్‌ క్రేజీ అప్ డేట్స్ తో విడుదల అయ్యింది. ఈ మార్పులు కేవలం డిజైన్‌ కు మాత్రమే పరిమితం చేసింది. ఈ కొత్త వెర్షన్ ను మలేషియా మార్కెట్‌ కోసం విడుదల చేసింది. మెకానికల్ గా, పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఈ స్కూటర్ పవర్ ఫుల్ గా ఉండటంతో వినియోగదారుల నుంచి పెద్దగా అభ్యంతరాలు లేవు. ఈ నేపథ్యంలో అలాగే కొనసాగిస్తోంది.

కొత్త అప్ డేట్స్ ఏంటంటే?

తాజాగా ఈ స్కూటర్ కు సంబంధించి తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్స్ లో ముఖ్యమైనది కలర్ ఆప్షన్లు. స్పేస్ వైట్, సవానా గ్రే, స్ట్రీట్ గోల్డ్ అనే మూడు కొత్త రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. వీటిలో స్ట్రీట్ గోల్డ్ వెర్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. గోల్డ్ కలర్ ముందు భాగం, వెనుక ప్యానెల్స్, ఎరుపు రంగు వీల్స్,  సస్పెన్షన్ భాగాలు దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. స్పేస్ వైట్ కూడా క్లీనుగా, ఆకట్టుకునేలా కనిపిస్తుంది. సవానా గ్రే మాత్రం సింపుల్, అందమైన రూపాన్ని ఇస్తుంది.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా SR GT 200 బలమైన స్కూటర్‌గా కనిపిస్తుంది. దీని బాడీవర్క్ దృఢంగా ఉండటంతో పాటు, పెద్ద వీల్స్, పొడవైన విండ్‌ స్క్రీన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ఆకట్టుకుంటుంది. దీని సీటు ఎత్తు 765 మిల్లీమీటర్లు ఉండటం వల్ల చాలా మంది రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్కూటర్ పూర్తి LED లైటింగ్‌ తో వస్తుంది. రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని చూపించడానికి మోనోక్రోమ్ LCD డిస్‌ ప్లే అందించారు.

Advertisement

ఇక ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ స్కూటర్ 174cc సామర్థ్యంతో కూడిన లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ను ఉపయోగిస్తుంది. ఇందులో నాలుగు వాల్వ్‌ లు, SOHC టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఇంజన్ యూరో 5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది 8,500 RPM దగ్గర 17.4 bhp పవర్, 7,000 RPM దగ్గర 16.5 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌ బాక్స్, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ తో ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

పవర్ ఫుల్ బ్రేకింగ్ సిస్టమ్

ఇందులో బ్రేకింగ్ వ్యవస్థ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఫ్రంట్ వీల్ కు 260mm డిస్క్, రియర్ వీల్ కు 220mm డిస్క్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం షోవా కంపెనీ భాగాలు ఉపయోగించారు. ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ లు, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఇవి రైడింగ్ సమయంలో మంచి కంఫర్ట్‌ ను అందిస్తాయి. ఈ స్కూటర్ మొత్తం బరువు 144 కిలోలుగా ఉంటుంది. అలాగే 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ ను కలిగి ఉంది.

Read Also: చీప్ అండ్ బెస్ట్ ఈవీ స్కూటర్, రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×