E-Paper
Advertisement

బైక్ లో పెట్రోల్ అయిపోనా ఇక నో టెన్షన్.. ఒకే కాల్ తో ఫ్యూయెల్ మీ ముందుకు వచ్చేస్తుంది!

బైక్ లో పెట్రోల్ అయిపోనా ఇక నో టెన్షన్.. ఒకే కాల్ తో ఫ్యూయెల్ మీ ముందుకు వచ్చేస్తుంది!
Advertisement

Emergency Roadside Assistance: హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వెహికల్ లో పెట్రోల్ అయిపోతే చాలా మంది భయపడుతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి వస్తే మరింత ఇబ్బందిగా మారుతుంది. దగ్గరలో పెట్రోల్ బంక్ లేకపోతే ఏం చేయాలా? అని ఆందోళన పడుతుంటారు. ఒకవేళ మీకూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓ చిన్న పని చేస్తే పెట్రోల్ మీ దగ్గరికే వచ్చేస్తోంది. ఇంతకీ ఏం చేయాలంటే..

1033 హెల్ప్‌ లైన్ నంబర్‌ కు కాల్ చేయండి!

జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌వేల మీద ప్రయాణించే వాహనదారుల కోసం ప్రత్యేక అత్యవసర హెల్ప్‌ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 1033 అనే హెల్ప్‌ లైన్ నంబర్‌కు కాల్ చేస్తే ఎమర్జెన్సీ హెల్ప్ అందుతుంది. ఈ సర్వీసులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మార్గం మధ్యలో చిక్కుకుపోయిన వాహనదారులకు అవసరమైన సహాయం అందించడమే ఈ నెంబర్ ఉద్దేశం.

15 నిమిషాల్లోపు పెట్రోల్ డెలివరీ

Advertisement

పెట్రోల్ అయిపోయిన సందర్భాల్లో ఈ సర్వీసు చాలా ఉపయోగపడుతుంది. 1033కు కాల్ చేసిన తర్వాత మీ లొకేషన్ వివరాలు తీసుకుని సమీప సిబ్బందిని పంపిస్తారు. సాధారణంగా 15 నుంచి 30 నిమిషాల్లోపు 5 నుంచి 10 లీటర్ల వరకు పెట్రోల్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. వాహనదారులు మళ్లీ సమీప పెట్రోల్ బంక్ వరకు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు.

వెహికల్ బ్రేక్ డౌన్ అయినా సాయం!

ఈ హెల్ప్ లైన్ నెంబర్ కేవలం పెట్రోల్ డెలివరీ సర్వీసు మాత్రమే కాదు. రహదారిపై వెహికల్ బ్రేక్‌ డౌన్ అయినప్పుడు కూడా ఈ హెల్ప్‌ లైన్ ద్వారా సహాయం పొందే అవకాశం ఉంటుంది. వెహికల్ స్టార్ట్ కాకపోవడం, టైర్ సమస్యలు, చిన్న మెకానికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు మెకానిక్ సపోర్ట్ కూడా అందిస్తారు. ప్రయాణికులు ఎక్కువసేపు రోడ్డుపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ప్రమాద సమయాల్లో అంబులెన్స్ సర్వీస్ కూడా..

Advertisement

ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో అంబులెన్స్ సేవలను కూడా ఈ హెల్ప్‌లైన్ ద్వారా అందించే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వెంటనే స్పందించడం వల్ల ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్ చాలా మందికి ఉపయోగపడుతోంది. అయితే, ఈ సేవలు జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌ వేలపైనే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి. సిటీలో, టౌన్ లలో సాధారణ రోడ్లపై ఈ సేవలు అందుబాటులో ఉండవు. సో, హైవే ప్రయాణాల సమయంలో ఈ హెల్ప్‌ లైన్ నంబర్‌ను సేవ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లు వెళ్లేవారు, రాత్రి ప్రయాణాలు చేసే వారు ఈ సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా పెద్ద సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవడం మంచిది.

Read Also: చేతులు వదిలి బైక్ నడిపితే ఆటోమేటిక్‌ గా స్పీడ్ తగ్గింపు.. యాక్సిడెంట్స్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం క్రేజీ ప్లాన్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×