E-Paper
Advertisement

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అలర్ట్ కాకపోతే అంతేసంగతులు!

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అలర్ట్ కాకపోతే అంతేసంగతులు!
Advertisement

Car Dashboard Warning Lights: లేటెస్ట్ కార్లలో డాష్‌ బోర్డ్‌ పై కనిపించే వార్నింగ్ లైట్లు చాలా ముఖ్యమైనవి. కానీ, చాలామంది డ్రైవర్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఈ లైట్లు కారు సమస్యల గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. వాటి అర్థం తెలుసుకుంటే పెద్ద ప్రమాదాలు, భారీ రిపేర్ ఖర్చులను తప్పించుకోవచ్చు. లేదంటే పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కార్లలో సాధారణంగా కనిపించే 10 ముఖ్యమైన వార్నింగ్ లైట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ చెక్ ఇంజిన్ లైట్

ఇది ఇంజిన్ ఆకారంలో కనిపిస్తుంది. ఇంజిన్, సెన్సార్లలో సమస్య ఉందని సూచిస్తుంది. లైట్ అలాగే వెలిగితే కారు  సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. కానీ, ఫ్లాష్ అవుతుంటే వెంటనే కారు ఆపడం మంచిది.

⦿ ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్

Advertisement

థర్మామీటర్ గుర్తుతో కనిపించే ఈ లైట్ ఇంజిన్ ఎక్కువ వేడెక్కిందని చెబుతుంది. కూలెంట్ తక్కువగా ఉండటం,  రేడియేటర్ సమస్య కారణం కావచ్చు. వెంటనే కారు ఆపి ఇంజిన్ చల్లబడే వరకు వెయిట్ చేయడం మంచిది.

⦿ బ్యాటరీ వార్నింగ్ లైట్

బ్యాటరీ గుర్తు కనిపిస్తే ఛార్జింగ్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు అర్థం. ఆల్టర్నేటర్, బ్యాటరీ పనిచేయకపోవచ్చు. ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే కారు పూర్తిగా ఆగిపోవచ్చు.

⦿ ABS వార్నింగ్

Advertisement

ABS అని కనిపించే ఈ లైట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ లో సమస్యను సూచిస్తుంది. సాధారణ బ్రేకులు పని చేసినా, అత్యవసర బ్రేకింగ్ సమయంలో అదనపు భద్రత ఉండకపోవచ్చు.

⦿ TPMS లైట్

టైర్ గుర్తులో ఆశ్చర్యార్థకం కనిపిస్తే టైర్లలో గాలి తక్కువగా ఉందని అర్థం. దీన్ని పట్టించుకోకపోతే టైర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వెంటనే టైర్ ప్రెజర్ చెక్ చేయాలి.

⦿ ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్

సీట్లో కూర్చున్న వ్యక్తి ముందు బంతిలా కనిపించే గుర్తు ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య ఉందని అర్థం.  ప్రమాదం సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోకపోవచ్చు. సో, వెంటనే చెక్ చేయించాలి.

⦿ డోర్ ఓపెన్ వార్నింగ్

డోర్, బూట్ సరిగా క్లోజ్ కాకపోతే ఈ లైట్ వెలుగుతుంది. హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరం కావచ్చు.

⦿ లో ఫ్యూయల్ వార్నింగ్

ఫ్యూయల్ పంప్ గుర్తు కనిపిస్తే ఇంధనం తక్కువగా ఉందని అర్థం. చాలాసేపు ఇలా నడిపితే ఫ్యూయల్ పంప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

⦿ ట్రాక్షన్ కంట్రోల్ లైట్

జారుతున్న కారు గుర్తు కనిపిస్తే రోడ్డు జారుడుగా ఉందని, ట్రాక్షన్ సిస్టమ్ పని చేస్తోందని అర్థం. లైట్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటే సిస్టమ్ చెక్ చేయించాలి.

⦿ పవర్ స్టీరింగ్ వార్నింగ్

స్టీరింగ్ వీల్ గుర్తు కనిపిస్తే పవర్ స్టీరింగ్‌లో సమస్య ఉన్నట్లు అర్థం. స్టీరింగ్ చాలా బరువుగా మారుతుంది. ముఖ్యంగా పార్కింగ్ సమయంలో ఇబ్బంది కలుగుతుంది.

మొత్తంగా ఈ వార్నింగ్ లైట్లు  కారు సమస్యలను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తాయి. కాబట్టి, డాష్‌ బోర్డ్‌ లో ఏదైనా లైట్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చెక్ చేయించడం మంచిది.

Read Also:సెకండ్ హ్యాండ్ కార్లలో ఫేక్ ఎయిర్ బ్యాగ్స్.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×